సాయి బాబా చాలీసా
జయ షిరిడిసా ఙ్ఞాన ప్రదాత
జయము జయము హే సజ్జన రక్షక
పత్రి గ్రామమున పుట్టిన ప్రభుడా
అత్రి అనసూయల పుత్రుడ దత్తుడ
సాధు రూపము దాల్చిన వాడా
సాయన ఓయని కాచెడి వాడా
చిరుత ప్రాయమున గురు వెంకూన చేరి
జీవిత సత్యములేన్నో నేరిచి
షిరిడి గ్రామమున పిచ్చి ఫకీరుగ
తిరిగి మసీదును జొచ్చిన వాడా
నీటితో దివ్వెల వెలిగించితివి
నాటితో దివ్యుడవై వెలసితివి
అఙ్ఞానముతో నూనె లేదను
వర్తక ప్రముఖుల నిల్పిసన్మార్గము
ఙ్ఞాన జ్యోతి వెలిగించితివీవు
ఙ్ఞాన రూపుడై వెలసితివీవు
పిచ్చి ఫకీరుగ తలచుచు జనులు
వచ్చిన వారల వ్యాధులు తీర్చుచు
శుభము కలుగు నీ మాటల చేతల
విభూతి నొసగుచు తీర్చగ వెతల
సన్నుతించి నిను శరణము పొందిరి
వినుతించుచు నీ దివ్య గాధలు
ఇష్ట దైవము నీవేయనగ
కష్టములన్ని మరచి కొలిచిరి
భక్తుల నెప్పుడు కాచీ బ్రోచెడు
భక్తాభీష్టా కరుణించు మయా
ఇహలోకమున కోర్కెలనన్నీ
తీర్చుచు ముక్తి నొసగెద నీవని
దైవము నీవని కొనియాడ భక్తులు
దాసుడననుచూ ధర్మము చెప్పి
దైవశక్తిని సధర్మ నిరతిని
నిత్యము తెలిపే నీవే పావని
శ్రీ రామ కృష్ణ శివ మారుతి రూపుగ
నిరతము భక్తులు కాచి కొలువగా
అట్టి రూపునే భక్తుల కాచుచు
ఆనందమొసగే సద్గురు నాథ
కలికాలమున ప్రియమున కావగ
వెలసిన దేవుడ షిరిడీ వాసుడ
నీ నామ స్మరణ సద్గతి నొసగు
నీపద సన్నిధి పెన్నిధి నొసగు
ఇహపరమొసగే శివుడవు నీవు
ఇహలోక వెతల తీర్చేడి విభుడవు
నిత్యము తలచి సర్వముయొసగి
నీవే దిక్కని కొల్తుము సాయి
శ్యామా తాత్యల కరుణించు రీతిని
మాపై కరుణ రవ్వంత చిలుకు
దాసుగణును ధర కాచిన విధమున
శుభకర మంగళ చరణము నొసగుము
విరియగ మాలో భక్తి శ్రద్ధలు
తరియించు శక్తి సత్వరమొసగుము
విజయానందుని మరణము తెలిసి
భయపడ వలదని చెంతకు పిలిచి
తల్లిని చూడగ సమయము కాదని
కరుణనొసగితివి సద్గతి వానికి
భుక్తికై ఆడెడు బెబ్బులి సాయి
ముక్తి పొందెనీ చరణ సన్నిధి
మహా ప్రళయము తాకగ షిరిడి
మహా దేవుడై భక్తుల కాచి
పంచ భూతముల శాశించు శక్తికి
పంచప్రాణాములు అర్పింతుము మేము
జగతి సర్వము నీవే యనగా
మృగము మనిషియని బేధము చూపక
ఎక్కడొ జరిగిన తప్పులు చెప్పి
ఇక్కడి భక్తుల ప్రేమతొ కాచి
భక్తుల సుఖములు నీవే యనుచు
భక్త పరాధీనత చాటి చెప్పేడు
నీ లీలేమి తెలియనివాడ(తెలియనిదాన)
నీ పద సన్నిధి కోరినవాడ(కోరినదాన)
నీ శక్తికతన మనిషిగ జగతిన
వరలెడు వాడా శ్రీ రామకృష్ణుడ
తల్లిగ తండ్రిగ సర్వము నీవుగ
తలచే పిల్లల కాచెడి విధముగ
ఈ నలుబది గీత చాలీస చదివే
భక్తుల నిత్యము కావుము దేవ
ప్రతి గురువారము ప్రేమతొ చాలీస
పఠించ సర్వ సుఖముల నొసగుము
సద్గురు నాథ శ్రీ సాయి దేవ
మద్గురు వర్యా మంగళరూప
నీ చరిత తలచెడి భక్తుల కెన్నడు
బాధలె లేని భాగ్యము నొసగుము
సాయినాథ సంకట హరణ
సాధు రూప షిరిడి వాసా
సర్వ దేవతా నిలయము నీవుగ
మదిలో నిలిచి మంగళమొసగుము
వ్యాధులు బాధలు తీర్చి కరుణతో
కాచి బ్రోచెడు కరుణాంతరంగ
శ్రీ రామ కృష్ణ శివ మారుతి రూపుగ
నిరతము మాలో వసియింపుమయ్యా......
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ
సాయి పరబ్రహ్మనే నమః
ఓం శ్రీ సాయి నాధాయ నమః
Comments
Post a Comment